ఒకరోజు నేను సరదాగా చేపలు పట్టడానికి మా ఊరి చివర ఉన్న చెరువు వద్దకు వెళ్ళాను. కాసేపటికి నా దగ్గర ఉన్న ఎరలు కాస్తా అయిపోయాయి. ఏం చేద్దామా అని ఆలోచిస్తుండగా ఒక పాము, నోట్లో కప్పతో నీళ్ళలో వెళ్తూ కనిపిచ్చింది.
చిన్న కప్పల్ని ఎరగా వెయ్యొచ్చుకదా అనిపించింది నాకు. పాము నోట్లో కప్ప ఉంది కాబట్టి అది నన్ను కాటు వెయ్యలేదు అని వెంటనే దాని తల దగ్గర పట్టుకుని గట్టిగా నొక్కే సరికి అది నోట్లో కప్పని వదిలేసింది. నేను వెంటనే ఆ కప్పని నాతో తెచ్చుకున్న బుట్టలో వేసేసుకున్నా.
మరి ఇప్పుడు, నోట్లో కప్ప లేని పాముని ఎలా వదలాలిరా దేవుడా అనుకుంటుంటే నా బ్యాగ్ లో విస్కీ బాటిల్ గుర్తొచ్చింది.
వెంటనే కాస్త విస్కీ తీసి ఆ పాము నోట్లో పోసేసా. ఒక నిమిషం తర్వాత ఆ పాము మత్తులోకి జారుతున్నట్టు తెలిసింది, 5 నిమిషాలలో మొత్తానికి నిద్రపోయింది. మెల్లగా దాన్ని ఇక నీళ్ళలో వదిలేసా.
అలా కాసేపు గడిచాక నేను హాయిగా కాళ్ళు నీళ్ళలో పెట్టి చేపలు పడుతున్నా. ఇంతలో కాలికి ఏదో తగిలినట్టు అనిపించింది. ఏంటా అని చూస్తే ఆ పాము ఈసారి రెండు కప్ప పిల్లల్ల్ని నోట్లో పట్టుకుని వచ్చింది.

0 Comments