బాగా వయసు అయిపోయిన జంట ఒకరోజు వాళ్ళ బెడ్ రూమ్ లో మంచం మీద పడుకుని ఉన్నారు. భర్తకి బాగా నిద్ర వస్తుంది, కానీ భార్య కాస్త రొమాంటిక్ మూడ్ లో ఉంది. మెల్లగా ఆమె అతని దగ్గరికి వెళ్ళి "ఏవండి గుర్తుందా మీకు , మన పెళ్ళి అవ్వకముందు మీరు ఎప్పుడు నా చేయి పట్టుకునే ఉండేవారు" అని అన్నది.


దానికి ఆయన ఏంతో కష్టపడుతూ ఆమె వైపు తిరిగి ఆమె చేయి పట్టుకుని , మళ్ళి నిద్రపోదామని కళ్ళు మూసుకున్నాడు.

మళ్ళీ కాసేపటికి ఆమె " మీరు నాకు ముద్దు కూడా పెట్టేవారు " అంది సిగ్గుపడుతూ.

లోపల చిరాకు పడుతున్న ఆమెని బాధపెట్టకుండా మెల్లగా ఆ పెద్దాయన లేచి ఆమె బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి మళ్ళీ కష్టపడుతూ ఒరిగి పడుకోడానికి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. 

మళ్ళీ కాసేపటికి ఆమె " మీరు తర్వాత నా మెడ మీద కోరికేవారు" అని అంది.

ఇక కోపం ఆపుకోలేక ఆ పెద్దాయన దుప్పటి విసిరేసి కష్టపడుతూ లేచి నుంచున్నాడు.

ఆమె కంగారుగా " ఏంటండి? ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నారు?" అంది.

"నా పళ్ళ సెట్ తెచ్చుకోడాని " అన్నాడు.