అమ్మ చేసిన ఆ ఒక్క పని చేసే దమ్ము, దేశంలో మరే ముఖ్యమంతి చేయలేదు.
సంచలనాలకి, మొండి పట్టుదలకి, తెగించి పోరాడే తత్వానికి మారుపేరైన జయలలిత తీసుకున్న అనేక నిర్ణయాలు దేశమంతా ప్రభావం చూపాయి. ఆమెను సంక్షేమపథకాలను మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాపీ కొట్టారు కానీ, ఆమె ధైర్యంగా తీసుకున్న ఆ ఒక్క నిర్ణయాన్ని మాత్రం ఎవరూ కాపీ కొట్టే సాహసం చేయలేకపోయారు. ఆ నిర్ణయం ఏమిటంటే..?
2003 సంవత్సరం లో తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకి దిగుతామని జయలలితను హెచ్చరించారు. ఆ హెచ్చరిక విన్న ఆమె ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. సాధారణంగా ఉద్యోగులు సమ్మె చేస్తామంటే ముఖ్యమంత్రి ఎవరైనా వణికిపోతారు..అలక పాన్పు ఎక్కినా అల్లుడి కోర్కెలు తీర్చినట్లు అడిగినవన్నీ ఇస్తారు.
కానీ జయలలిత ఏమాత్రం బెదరకుండా చిరునవ్వు నవ్వడం అందర్నీ ఆశ్చర్యపరచింది. ఆ చిరునవ్వు వెనుక ఉన్న అసలు రహస్యం మూడు వారాల తర్వాత జనాలకి అర్థం అయ్యింది. దాదాపు 80 ఉద్యోగసంఘాలు సమ్మెకి పిలుపు ఇచ్చాయి. సమ్మె మొదలయ్యే ముందు రోజు రాత్రి పోలీసులు ఉద్యోగులకి చుక్కలు చూపించారు.
ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం తో, ఉద్యోగ సంఘాల నాయకులని అరెస్ట్ చేసి లోపల వేసారు. సమ్మెలో పాల్గొంటే ఊరుకోబోమని ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు ఉద్యోగులు విధులకి హాజరు కాకపోతే, వారికి బదులుగా డ్యూటీ చేయడానికి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగులని నియమించింది. ఒక్క కలం పోటుతో లక్షాడెబ్బై వేల మంది ఉద్యోగులని డిస్మిస్ చేసి పారేసింది.
దీనితో ఉద్యోగులు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు జడ్జి 24 గంటల్లో తొలగించిన ఉద్యోగులని మళ్ళీ విదులలోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. వెంటనే జయలలిత ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేసింది. డివిజన్ బెంచ్ జయ నిర్ణయాన్ని సమర్థించింది. దీనితో ఉద్యోగులు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు.
ఈ కేసులోనే సుప్రీం కోర్టు ఉద్యోగులు జీవితంలో మర్చిపోలేని తీర్పు ఇచ్చింది. “సమ్మె చేయడం ప్రభుత్వ ఉద్యోగుల ప్రాధమిక హక్కు కాదు” అని సుప్రీం కోర్టు విస్పష్టంగా తీరు చెప్పింది. సమ్మె కాలంలో హింసకు పాల్పడని ఉద్యోగులని మాత్రం తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సుప్రీం సూచించింది.
చివరికి ఉద్యోగ సంఘాలు జయలలిత తో కళ్ళ బేరానికి దిగాయి. 2400 ఉద్యోగులు తప్ప మిగతావారిని జయ మళ్ళీ ఉద్యోగాలలోకి తీసుకున్నారు. ఆ 2400 మంది జయని కాళ్ళావేళ్ళా పడి బ్రతిమలాడగా కొందరిని తర్వాత విధుల్లోకి తీసుకుంది. సమ్మె ప్రాథమిక హక్కు కాదు అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుండి దేశవ్యాప్తంగా ఉద్యోగుల సమ్మె చేయడం తగ్గింది.
ఇంత ధైర్యంగా జయలలిత వ్యవహరించబట్టే, తమిళనాడు ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారు. అమ్మ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు అన్నీ పక్కాగా అమలు జరుగుతున్నాయి అంటే ఉద్యోగుల్లో అమ్మ తీసుకొచ్చిన క్రమశిక్షణేకారణం.

0 Comments