"ఎక్కడ ఈయన ..? మంచి షాపింగ్ మూడ్లో ఉన్నప్పుడు వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు ? " అని భార్య అనుకున్నది. అతని కోసం అటు ఇటు చూసింది. వచ్చిన దారినే వెనక్కి వెళ్ళి వెతికింది. ఆయన ఎక్కడా కనిపించలేదు. ఆమెకి కోపం వస్తుంది. భయం వేస్తుంది. ఇక ఆగలేక తన భర్తకి ఫోన్ చేసింది.
"ఎక్కడ ఉన్నారు మీరు, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు " అని అన్నది ఆమె చాలా కోపంగా.
అతను నెమ్మదిగా "హలో బంగారం, నీకు గుర్తుందా మనం ప్రేమించుకునే రోజుల్లో ఇదే మాల్ లో ఒక బంగారం షాపులో నీకొక వజ్రాల నెక్లెస్ నచ్చింది, కానీ అప్పుడు దాన్ని కొనే పరిస్థితి నాకు లేదు, కానీ నీకొక ప్రామిస్ చేసా ఎదో ఒక రోజు నీకు అది కొనిస్తా అని , గుర్తుందా నీకు ? " అన్నాడు.
ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోయింది. "హా గుర్తుంది బంగారం, గుర్తుంది " అని అన్నది.
"ఆ షాప్ పక్కనే ఉన్న బేకరీలో కూల్ డ్రింక్ కొన్నా ఇద్దరికీ , నువ్వు ఇటు వచ్చెయ్ "అన్నాడతను మాములుగా.
మీ స్నేహితులకి ఈ జోకుని SHARE చేయడం మర్చిపొకండోయ్.

0 Comments