నల్లదనం  అదుపు  చేస్తాను .
దొంగ నోట్లను  అరికడతాను..
 అన్న  పెద్ద  మనుషుల్లారా ...  
ఈ కింది  ప్రశ్నలకు  సమాధానం  ఇవ్వండి....


1.స్విస్ బ్యాంకు లిస్టు ఇస్తాను  అన్నాడు.సుప్రీం  కోర్ట్  చర్యలు  తీసుకోమన్నది , మీరు  వంద  రోజుల్లో  డబ్బు  తెస్తాము  అన్నారు.మరి  ఆ  చర్యలు  ఎంతవరకు  వచ్చాయి?

2 . గత  కాంగ్రెస్  ప్రభుత్వం అవినీతి  లో  కూరుకు పోయింది , అనేక  స్కాం  లు  జరిగాయి  అని  కదా ప్రజలు మీ  ప్రభుత్వానికి ఓట్లు  వేసింది మరి ఎంతమంది  కాంగ్రెస్  మంత్రుల  మీద  కేసులు  పెట్టారు? ఎంతమందిని  జైళ్ళ  లో  పెట్టారు?

3 .బొగ్గు  కుంభకోణం, స్పెక్ట్రమ్  కుంభకోణం, కే జి  గ్యాస్  కుంభకోణం, శారద, నారదా, లలిత్ గేటు, వ్యాపం లాంటి ఆదాయానికి  మించి  ఆస్తులు ఇలా  చాలా కుంభకోణాలు  ఉన్నాయి  కదా  మరి  వాటి  మీద  మీరు తీసుకొన్న  చర్యలు ఏమిటి?
చర్యలు  తీసుకోవడానికి రెండున్నరేళ్ళు   సమయం సరిపోలేదా?

4.లక్షల  కోట్లు రూపాయలు బ్యాంకులకు  ఎగవేసిన  మంత్రులు, పార్లమెంట్  సభ్యులు  మాజీలు,కార్పోరేట్ సంస్థలు చాలా మంది  మీ పార్టీలో మీ ప్రభుత్వం లో  ఉన్నారు. వారిని ముందు అరెస్ట్  చేయలేరా?

5. హర్యానాలో భూ కుంభకోణంలో  మాజీ  ముఖ్యమంత్రి , సోనియా  అల్లుడు  దోషులుగా  ఉన్నారు  అని  ఎన్నికల  ముందు  చాలా విమర్శలు  చేశారు , వారి పై  చర్యలు  ఏవి ?

6. ఎక్కడిదాకో ఎందుకు ఎంఎల్ఎ లను కోనే సమయంలో ఫోన్ ట్యాప్ కుంభకోణం లో  అడ్డంగా  చిక్కిన  బాబు ను  భద్రంగా  చూస్తున్నది  ఎవరు ?

7. అవినీతికి  చిరునామా గా  మారిన  తిమింగలాలపై  కనీస  చర్యలు  ఎవీ ? కేసులు  ఎత్తివేసే  పనులో  ఉన్నారు

8 ఢిల్లీ  క్రికెట్ కుంభకోణం లో  అరుణ్ జెట్లీ అడ్డంగా  దొరికాడు  కదా అయన  పై  చర్యలు  ఏవి  ?

9 . పడే  పడే  నన్ను  చంపుతారు  అని  ఏడ్చే మీకే రక్షణ  లేకపొతే , మీరూ  మీ  ప్రభుత్వం  అవసరమా  ?

10.కే జి  బేసిన్ లో  లక్షల  కోట్లు  తిన్నారు  అని  రిలయన్స్  వారి పై  ప్రభుత్వ  రంగ  సంస్తలే  రిపోర్ట్  ఇస్తే ఇంత వరకు  ఏమి  చర్యలు  తీసుకోక  పోగా , వారి  దొంగ  ప్రోడక్ట్  కు  మీరు  బ్రాండ్  అంబాసడర్  గా  మారడం  ఏమిటి ?

11 నల్లదనం  కోసమే పెద్ద నోట్లు  రద్దు  చేశాను  అన్ని  చెప్పిన  మీరు  మరి 2000 రూపాయల  నోటు  ను  ఎందుకు  ముద్రించారు?

12 , మీ  పార్టీ  ఎంపి లు , అద్యక్షులు  నాయకులకు 2000 రూపాయల నోట్లు  మార్కెట్  లోకి  రాకుండానే   లక్షల  కట్టలు  ఎలా  చేరాయి  ?
వారి  పై  చర్యలు  ఏవి ?

13 మీ  జమానాలో  ఎన్ని  INCOME TAX దాడులు  పెద్ద  చేపల  మీద  జరిగాయి ?
 యెంత  రికవరీ  జరిగింది ? ఎంతమందిని  అరేస్టు  చేసారు ?

14 .మీ జమానాలో CBI  పరిష్కరించిన  అవినీతి  కేసులు  ఎన్ని ?

👍👌చివరగా ఇది భక్తులకు, సైనికులకు మాత్రమే సంభందించిన అంశం కాదు.
భారతదేశంలోని ప్రతి పౌరునికి సంభందించినది.
రోజూ పని చేసుకొనే కూలి ఎన్ని కూలి దినాలో పోగొట్టుకొన్నాడో..
 చిన్న చిన్న వ్యాపారులు చిల్లర లేక సరుకు అమ్ముడు పోక ఎంత ఇబ్బంది పడుతున్నారో.....
మందులు దొరకక, వైద్యం అందక రెండు నెలల పసికందు నుండి 75 సంవత్సరాల ముసలి వరకు చనిపోయారు.
వీరి హత్యలకు ఎవరు భాద్యులు?
"రాయలేను వాస్తవాలను"

చుసినవన్నీ రాయాలంటే.. నిజాలనీ అక్షరీకరించాలంటే..
కలం వణుకుతోంది!

ఆడి కారులో అంగరక్షకుల మధ్య పోతున్న ఆమాత్యుడి ఆకృత్యాలను రాయలేను..!

రోగిని పీల్చి పిప్పి చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రుల ఘోరాలను రాయలేను..!

నల్లధనం వెలికితీయడమంటే స్విస్ బ్యాంకుల్లో సొమ్ము ముట్టకుండా.. సామాన్యుడి స్వేదంతో నిండిన నోట్లను బ్యాంకుకు రప్పించడమా..
అని నిగ్గదీసి రాయలేను!

అతి కష్టం వస్తే తప్ప తీయకూడదని.. పోపు డబ్బాల్లో ఆడోళ్ళు, డిబ్బీల్లో పిల్లలు  సెంటిమెంట్ గా దాచిన నోట్లలో.. ఉందా నల్లదనమని నేను రాయలేను!

నోట్ల కట్టలు పుట్టలుగా ఉన్న   గుంట నక్కలు దర్జాగా తిరుగుతుంటే..   బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లో
పని మానుకొని నిలబడిన కూలోడా? నీకు ఇదొక్కటే దారి.. వాళ్లకు ఎన్నో దొడ్డి దారులు.. మారాదా ఈ లోకమని నే రాయలేను!

పబ్లిసిటీ  స్టంటా? తెలివిగా   "టూ తౌజండ్" ప్రెజెంటా?
ఉన్న పెద్దనోట్లే వద్దనుకుంటే.. ఏడు వేల కోట్ల ఖర్చుతో కొత్త "రంగు నోట్లు" ఎవరికోసమని
నేను రాయలేను!

మేధావులూ మైకంలో నుంచి తెరుకోండి..  వాస్తవంగా  దేశంలో ఏం జరుగుతుందో.. సామాన్యుడికి ఎలాంటి "న్యాయం"  చేస్తున్నారో విశ్లేషించండని గట్టిగా నేను రాయలేను.⁠⁠⁠⁠