మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పటినుంచి అయితే 500/1000 నోట్లు రద్దు అని ప్రకటించారో అప్పటినుంచి అంతా అల్లకల్లోలంగా ఉంది. ఎటు చూసినా కిలోమీటర్ల కొద్ది లైన్లో నిలబడిన జనాలే కనిపిస్తున్నారు.
ఈ పరిస్తితిని చక్కపెట్టాలని ప్రభుత్వం ఎంతో ప్రయత్నిస్తూనే ఉంది. కానీ రోజు రోజుకీ లైన్లో జనం పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు.
ఈ క్రమంలో ప్రభుత్వం ఇంకో చక్కటి ఆలోచనతో ముందుకి వచ్చింది. ఇకనుంచి బ్యాంకులు పోస్ట్ ఆఫీసుల నుంచే కాకుండా పెట్రోల్ పంపులనుండి కూడా మనం డబ్బు తీసుకోవచ్చు. అవునండి మీరు విన్నది నిజమే. కేవలం మీ ఎ.టి.యం కార్డుని తీసుకెళ్ళి పెట్రోల్ పంపు నుండి 2000 రూపాయల వరకూ డబ్బు తీస్కోవచ్చు.
పెట్రోల్ పంపులో మీ కార్డుని మెషిన్లో గీసి డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

0 Comments